ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే గేయంగా పనిచేస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ డిపోలో శనివారం కొత్త బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పెద్ద సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. గత ప్రభుత్వ హయంలో ఆర్టీసీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒక్క కొత్త బస్సును కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉండేది అన్నారు.