సాంఘిక శాస్త్ర సిలబస్ భారం తగ్గించాలని లేనట్లయితే విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు రెండేసి పోస్టులు కేటాయించాలని ఫోరమ్ జిల్లా నాయకులు బాడాన రాజు, మక్కా శ్రీనివాస రావు, ఎల్. గుణ శేఖర్ ఆదివారం శ్రీకాకుళం నగరంలో డిమాండ్ చేశారు. విద్యార్థుల మానసిక స్థాయిని దృష్టిలో పెట్టుకొని సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను పునఃపరిశీలించలన్నారు. అనంతరం డిఈఓ కు వినతి పత్రం అందజేశారు.