కూటమి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుందని ఎమ్మెల్యే గోండు శంకర్ రావు అన్నారు. శనివారం శ్రీకాకుళం రూరల్ కిష్టప్పపేట పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. మరింత అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.