విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శనివారం గార మండలం కళింగపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలల్లో కూడా విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.