ఆంధ్రప్రదేశ్ ను సముద్రాభివృద్ధికి ముఖద్వారంగా తీర్చిదిద్దేందుకు శ్రీకాకుళంలో ఓడరేవు అభివృద్ధిపై కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తో టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు బుధవారం చర్చించారు. 974 కిలోమీటర్ల తీరరేఖ, 42 లక్షల మత్స్యకారులతో ఏపీ సముద్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.