కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి చేయడమే తొలి అడుగుగా ముందుకు వెళ్లడం జరుగుతుందని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. శనివారం ఉదయం శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్ప పేట పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మరింత అభివృద్ధి చేసేందుకు తమకు సహకరించాలని కోరారు.