కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కోర్టు విధుల్లో ఉండే కోర్టు ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు ప్రతిభకనబరచాలని ఎస్పి కె. వి మహేశ్వర రెడ్డి కోర్టు లైజినింగ్ అధికారులకు శనివారం సూచించారు. పోలీస్ శాఖలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకమన్నారు. జిల్లావ్యాప్తంగా పలు కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న కోర్టు ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షించారు.