శ్రీకాకుళం మండలంలోని గూడెం, రాగోలు, పాత్రునివలసలో శుక్రవారం కురుస్తున్న పొగ మంచు ఉద్యానవన పంటలపై పగ పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటల వరకు దట్టంగా కురుస్తున్న పొగమంచుకు రైతులు, స్థానికులు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ పొగమంచుతో జీడి, మామిడి పంటలకు టీ దోమ, బూజు తెగులు వంటివి వ్యాధులు వ్యాపించి నష్టపరిచే ప్రమాదం ఉందని ఉద్యానవనశాఖ అధికారి మాధవీలత తెలిపారు.