శ్రీకాకుళం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్ 14 వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం డా. బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ ఫిర్యాదుల కోసం వచ్చేవారు పరిశీలించాలని సూచించారు.