శ్రీకాకుళం: "వ్యాపారులు తప్పనిసరిగా జీఎస్టీ చెల్లించాలి"

59చూసినవారు
శ్రీకాకుళం: "వ్యాపారులు తప్పనిసరిగా జీఎస్టీ చెల్లించాలి"
జీఎస్టీ పరిధిలోని వ్యాపారులు, జీఎస్టీ లేకుండా వ్యాపారం చేస్తున్న వ్యాపారులు కూడా తప్పనిసరిగా పన్నులు చెల్లించాల్సిందేనని శ్రీకాకుళం అసిస్టెంట్ కమిషనర్ జి రాణి మోహన్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పన్నుల శాఖ కార్యాలయంలో టాక్స్ ప్రాక్టీషనర్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరం మార్చినాటికి ముగుస్తుందని ఏమైనా బకాయిలు ఉన్నట్లయితే తక్షణమే చెల్లించాలని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్