పాత శ్రీకాకుళంలో కొలువైన పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి అమ్మవార్ల సిరిమానోత్సవాల్లో భాగంగా మంగళవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం తెలిపారు. పొట్టి శ్రీరాములు కూడలి నుంచి జడ్పీ కార్యాలయం, సంతోషిమాత గుడి, కలెక్టర్ బంగ్లా, కునుకుపేట మధ్య ఎటువంటి వాహనాలను అనుమతించరు. 80 అడుగుల రోడ్డు నుంచి వాంబే కాలనీ, బాదుర్లపేట, కొత్తపేట, కునుకుపేట రోడ్డులోనూ అనుమతించరు.