శ్రీకాకుళం డీఆర్డీఏ పరిధిలోని వెలుగు కార్యాలయ సిబ్బంది బదిలీ అయినట్లు డీఆర్డీఏ పీడీ పెద్దింటి కిరణ్ కుమార్ గురువారం రాత్రి తెలిపారు. సెర్ఫ్ మార్గదర్శకాలకు అనుగుణంగా 72 మందిని బదిలీ చేసినట్లు చెప్పారు. ఐదేళ్ల పైబడీ పనిచేసిన ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి డిప్యూటేషన్ పై వెళ్లిన వారిని జిల్లా కోఆర్డినేటర్లుగా నియమించినట్లు పేర్కొన్నారు.