శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళా మందిరంలో ఆగస్టు 2న ఉత్తరాంధ్ర స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన వివరాలను రంగస్థల కళాకారుల సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు పన్నాల నరసింహమూర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోటీలకు అప్పులస్వామి స్మారక పోరాట కీక, సాంఘిక, జానపద, పద్యనాటక ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94403 47848, 94903 44620 సంప్రదించాలని కోరారు.