ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం బందరువానిపేట గ్రామంలో ఎమ్మెల్యే బస వేశారు. అన్ని వీధుల్లో పర్యటిస్తూ పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ముఖ్యంగా త్రాగు నీరు సమస్య ఉందని ప్రజలు తెలియజేశారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు