రథ సప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న వేడుకల్లో స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను అందించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో రథసప్తమి వేడుకలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తుల రద్దీ ఈ మూడు రోజులు ఎక్కువగా ఉంటుందని ఇందుకు స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను ప్రజలకు అందించాలన్నారు.