టెక్కలి మండలంలో వీఆర్వోగా విధులు నిర్వర్తించిన మెట్ట జనక మోహనరావు పదవి విరమణ మహోత్సవ కార్య క్రమం ఆదివారం శ్రీకాకుళంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి డా కిల్లి కృపారాణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వీఆర్వో దంపతులను సత్కరించారు. కేంద్ర మాజీ మంత్రి డా కిల్లి కృపారాణి ఆయన సేవలను కొనియాడారు.