శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కంచరాన రాజగోపాలరావు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేశారు. ఆదివారం శ్రీకాకుళం వెటర్నరీ పోలీ క్లినిక్పోలీక్లినిక్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పెంపుడు జంతువుల నుండి మనుషులకు సంక్రమించే రేబిస్, మెదడువాపు, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఆంత్రాక్స్, లెప్టోస్పైరాసిస్, బృసెల్లోసిస్లెప్టోస్పైరోసిస్, బ్రుసెల్లోసిస్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు.