యోగాసనాలు జీవితంలో భాగం కావాలని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీ వెల్లడించారు. శుక్రవారం శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ యోగా పై అవగాహన కలిగి ఉండాలని, ప్రతీ రోజు ఇంటి వద్దే యోగాసనాలు చేసుకోవచ్చన్నారు. యోగాసనాలు చేయడం వలన ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చని చెప్పారు. యోగాసనాలతో వ్యాధులు దూరమవుతాయన్నారు.