ప్రతీ రోజు యోగాసనాలు చేయడం వలన మానసిక ఒత్తిడి దూరమవుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి. సూర్య ప్రకాష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద యోగాసనాలు చేయవచ్చన్నారు. గురువారం శ్రీకాకుళంలో 80 అడుగుల రహదారిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా పట్ల అందరూ అవగాహన పెంచుకొని యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చని చెప్పారు.