యోగాసనాలతో వ్యాధులు దూరమై సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో యోగాసన కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మూడు చారిత్రక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలను నిర్వహించుకున్నామని నేడు ఆర్ట్స్ కళాశాలలో చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.