శ్రీకాకుళంలోని గుడి వీధి సచివాలయం పరిధి అంగనవాడి కేంద్రాల్లో కిషోరి వికాస వేసవి సెలవుల కార్యక్రమాన్ని అధికారులు శనివారం ప్రారంభించారు. అంగన్వాడీ టీచర్ ఎంఎస్కే బి పద్మజ, ఆశ, ఏఎన్ఎంల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాల్యవివాహాలు వలన కలిగే అనర్థాలను దుష్ప్రభావాలను దృశ్య రూపంలో చక్కగా అర్థమయ్యేలా వివరించారు.