టెక్కలిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బంది మంగళవారం నిరసన తెలిపారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నామని తాజాగా నూతన ప్రభుత్వ మద్యం పాలసీ విధానంతో తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని తమకి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నూతన మద్యం పాలసీ విధానంతో ప్రభుత్వ మద్యం షాపులు గడువు పూర్తికావడంతో తాము ఉద్యోగాలను కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.