గ్రామ స్వరాజ్య స్థాపనకు జాతిపిత మహాత్మా గాంధీజీ ఎంతో కృషి చేశారని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్రావు తెలిపారు. బుధవారం శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస గ్రామం వద్ద మహాత్మా గాంధీ జయంతిని పరిష్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలల కన్నా స్వరాజ్యాన్ని స్థాపించాలన్నారు.