శ్రీకాకుళంలో గల కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో గురువారం మోటార్ వాహనాల చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. జిల్లా అడిషనల్ జడ్జి సిహెచ్ యుగంధర్, కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్, ఇన్సూరెన్స్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కళాశాల డైరెక్టర్ బి. ఎస్ చక్రవర్తి, వైస్ ప్రిన్సిపల్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.