జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన బాట అనుసరణీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బుధవారం పాత్రుని వలసలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశాన్ని బ్రిటిష్ వారి దాస్య సంకెళ్ల నుంచి విముక్తిని చేయడానికి గాంధీజీ సత్యం, అహింస, శాంతి ఆయుధాలుగా చేసుకుని పోరాటం సాగించారన్నారు.