జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన బాట అనుసరణీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం మండలం పాత్రుని వలసలో గాంధీజీ విగ్రహానికి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశాన్ని బ్రిటిష్ వారి దాస్య సంకెళ్ల నుంచి విముక్తిని చేయడానికి గాంధీజీ సత్యం, అహింస, శాంతి ఆయుధాలుగా చేసుకుని పోరాటం సాగించారన్నారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.