నేడు శ్రీకాకుళంలో ట్రాఫిక్ ఆంక్షలు

71చూసినవారు
నేడు శ్రీకాకుళంలో ట్రాఫిక్ ఆంక్షలు
పాత శ్రీకాకుళంలో కొలువైన పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి అమ్మవారి సిరిమానోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీకాకుళం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. వాహనాల దారి మళ్లింపు వేళల్లో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సిరిమానోత్సవం పూర్తయ్యే వరకు, బుధవారం  ఉదయం 9 నుంచి రాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వివరించారు. ఉత్సవాల్లో మద్యం తాగి వాహనాలు నడపకూడదని అన్నారు.

సంబంధిత పోస్ట్