మహిళా సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతిని పాలకొండ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి బొమ్మాలి సుధాకర్, పాలకొండ ఎంపీడీవో ఎం. వి రంగారావు, సీతంపేట ఎంపీడీవో గీతాంజలి, ఎంఈఓ 2 సోంబాబు, ఎంఈఓ & ఐఈఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు.