డా. బి ఆర్. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ నూతన కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.