వడ్డే ఓబన్న 218వ జయంతి శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఉదయం జరిగింది. కార్యక్రమానికి అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. వి. రమణ హాజరై వడ్డే ఓబన్న చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సామాన్యుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ఓబన్న అని కొనియాడారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు.