అనకాపల్లి జిల్లా కి చెందిన శివ వజ్రపుకొత్తూరు మండలం, శివసాగర్ బీచ్ కి మంగళవారం తెల్లవారుఝామున వచ్చి సముద్ర స్నానానికి దిగాడు. శివకి ఈత రాకపోవడంతో అలలకు చిక్కి పెద్దగా కేకలు పెడుతూ ఉండగా స్థానికులు చూసి, ఒడ్డుకు తెచ్చి, సపర్యలు చేశారు. ఈ విధముగా శివ మృత్యుంజయుడు అయ్యాడు.