వీరఘట్టం మండల ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో బెందాళం వెంకటరమణ క్షేత్ర సహాయకులు, సాంకేతిక సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి 100 రోజుల పని కల్పించడం, పల్లె పండుగ పనులు పూర్తి చేయడం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గుర్తించిన పనులు అంచనాలు తయారు చేయడం పై సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఏపీవో జి. సత్యం నాయుడు, ఈసీ కృష్ణ ప్రసాద్, క్షేత్ర సహాయకులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.