గార మండలంలోని బందరువానిపేటను అన్ని విధాలుగా బాగుచేసి అభివృద్ధి చేసే బాధ్యత నాదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హామీనిచ్చారు. మండలంలోని బందరువానిపేటలో శుక్రవారం పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం గ్రామ ప్రజలతో రచ్చబండ వద్ద మాట్లాడుతూ గ్రామంలో శ్మశానవాటిక, లైటింగ్ హౌస్, సముద్రతీర ప్రాంతం, కాంపౌండ్‌వాల్, శిథిలావస్థలో ఉన్నవాటర్ ట్యాంకు పరిశీలించానన్నారు.