అరసవిల్లిలోని రథసప్తమి పర్వదినం సందర్భంగా మంగళవారం విశాఖపట్నం డిఐజి గోపీనాథ్ జెట్టి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తో కలిసి పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బందోబస్తులో భాగంగా పోలీసుల విధుల నిర్వహణపై ఆరా తీశారు.