సంతబొమ్మాలి మండలం నౌపడ గ్రామం లోని టెక్కలి వీధిలో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పంచమ వార్షికోత్సవం జులై 1న జేష్ఠ మాసం శుక్లపక్షం దశమి సోమవారం నాడు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు నగేష్ శర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులందరూ స్వామి వారి వార్షికోత్సవ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.