311 పశువులకు గొంతు, జబ్బవాపు నివారణ టీకాలు

82చూసినవారు
311 పశువులకు గొంతు, జబ్బవాపు నివారణ టీకాలు
కోటబొమ్మాళి మండలం లోని తర్లిపేట, రేగులపాడు, కన్నేవలస, గుడివాడ, గంగుపేట, గొల్లపేట తదితర గ్రామాల పరిధి లోని 311 పశువులకు శనివారం స్థానిక పశుసంవర్థక సహాయకులు ఎం. లోకనాధం పర్యవేక్షణలో గొంతు, జబ్బవాపు నివారణ టీకాలు వేయటం జరిగిందని పశువైద్యాధికారి డాక్టర్‌ లఖినేని కిరణ్‌కుమార్‌ అన్నారు. వర్షాకాలం ప్రారంభమవడంతో ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్