వృద్ధురాలికి గృహాన్ని నిర్మించిన దాత

65చూసినవారు
వృద్ధురాలికి గృహాన్ని నిర్మించిన దాత
సంతబొమ్మాలి మండలం నౌపడ గ్రామంలో నిరుపేద వృద్ధురాలు గుజ్జు భూలమ్మకు చెన్నూరు నారీమణి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెన్నూరు దుర్గారావు బాబ్జీ సుమారు 60000 రూపాయలు ఖర్చుతో రేకుల గృహాన్ని నిర్మించారు. ఈ మేరకు బుధవారం స్థానిక మహిళలు యువకుల ఆధ్వర్యంలో గృహ ప్రవేశం జరిపించారు. అలాగే భూలమ్మకు నెల రోజులకు సరిపడా కిరాణా సరుకులను, వస్త్రాలను అందజేశారు. ఆమె యోగక్షేమాలు కూడా చూస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్