టెక్కలి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అభయం యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అభయం ఫుడ్ బ్యాంక్ వార్షికోత్సవం సందర్భంగా 15, 16 తేదీల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 75 మంది రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు, సెక్రెటరీ లారీ కామేశ్వరరావు, ట్రెజరర్ శ్రీనివాస్ బెహర సభ్యులు పాల్గొన్నారు.