టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన వివాహిత బగాది మహాలక్ష్మి మంగళవారం ఒంటి పై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త తో వివాదాల వల్ల ఇంట్లో ఉన్న డీజిల్ ఒంటి పై పోసుకుని నిప్పంటించుకోగా గమనించిన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. 50 శాతానికి పైగా కాలిపోవడంతో అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం విశాఖ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.