రెండు ఏళ్లు పూర్తి చేసుకున్న అభయం ఫుడ్ బ్యాంక్

71చూసినవారు
రెండు ఏళ్లు పూర్తి చేసుకున్న అభయం ఫుడ్ బ్యాంక్
టెక్కలి మండల కేంద్రంలో ఆకలితో అలమటించే అభాగ్యుల కొరకు అభయం యువజన సేవా సంఘం స్థాపించిన అభయం ఫుడ్ బ్యాంక్ శుక్రవారం నాటికి రెండు ఏళ్లు పూర్తిచేసుకుని మూడవ సంవత్సరంలో అడుగుపెట్టింది. అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రెండేళ్లలో ఈ ఫుడ్ బ్యాంక్ కి సుమారు15 లక్షల రూపాయలు ఖర్చు అయిందన్నారు. సహకరించిన అన్నదాతలందరికీ అభయం యువజన సేవా సంఘం తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్