ఎమ్మెల్యేగా ఆరోసారి ప్రమాణం చేసిన అచ్చెన్నాయుడు

62చూసినవారు
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టి, ప్రమాణ స్వీకారం చేశారు. 1996, 1999, 2004లో హరిశ్చంద్రపురం నియోజక వర్గం నుంచి మూడుసార్లు గెలుపొందారు. 2009లో ఓటమి చవిచూశారు. 2014 నుంచి టెక్కలి నియోజకవర్గం నుంచి ఆయన రెండు సార్లు వరుసగా గెలుపుగుర్రం ఎక్కారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై 34,519 ఓట్లు తేడాతో అచ్చెన్న మరోసారి విజయం దక్కించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్