భగవన్ పురం: ఏటీఎం వద్ద మోసపోయిన మహిళ

74చూసినవారు
భగవన్ పురం: ఏటీఎం వద్ద మోసపోయిన మహిళ
టెక్కలి మండలం భగవన్ పురం గ్రామానికి చెందిన నారా లోలాక్షి అనే మహిళ ఏటీఎం వద్ద మోసపోయి రూ.29 వేలు కోల్పోయింది. గత నెల 20న సదరు మహిళ ఏటీఎంకు వెళ్లగా వెనుక ఉన్న వ్యక్తి సాయం కోరింది. ఆయన రూ.7 వేలు విత్ డ్రా చేసి కార్డు మార్చాడు. ఆ తర్వాత పలు ఏటీఎంలో రూ.22 వేలు డ్రా చేశాడు. ఈ నెల 6న మిగతా రూ.7 వేలు తీసుకున్న తర్వాత ఖాతా ఖాళీ అవ్వడంతో గుర్తించి ఏటీఎం బ్లాక్ చేయించారు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్