భావనపాడు, నౌపాడ పంచాయితీ జగన్నాధపురంల లోని ప్రభుత్వ వైన్ షాపులలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో మందుబాబులకు అక్కడ దొరకని బ్రాండ్లు బెల్ట్ షాపుల్లో దొరకడం మంగళవారం వెలుగు చూసింది. మూత లేని బీరులు అమ్మకాలు కూడా జరిపారు. వైన్ షాపుల్లో సిబ్బంది ఎం. ఆర్. పి రేటుకంటే పది రూ. లు అదనంగా తీసుకొని అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. దీంతో మందుబాబులు కోరిన బ్రాండ్లు ప్రభుత్వ మద్యం షాపుల్లో దొరకడం లేదు.