కోటబొమ్మాళిలో పెద్ద పులి సంచారం.. గుర్తించిన అటవీ అధికారులు

66చూసినవారు
కోటబొమ్మాళి మండలం పొడుగు పాడు గ్రామం వద్ద గురువారం రాత్రి 12: 45 గంటలకు నరసన్నపేట నుంచి టెక్కలి వైపు వస్తున్న 108 డ్రైవర్ అప్పలనాయుడుకి పెద్ద పులి నేషనల్ హైవే రోడ్డు దాటుతుండగా కనిపించింది. తక్షణం ఆయన అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఆ శాఖాధికారి జగదీశ్ సిబ్బందితో కలిసి శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని పెద్ద పులి అడుగుజాడలను గుర్తించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.

సంబంధిత పోస్ట్