బోరుభద్ర: వైద్య సిబ్బంది సమయ వేళలు పాటించకపోతే చర్యలు తప్పవు

59చూసినవారు
బోరుభద్ర: వైద్య సిబ్బంది సమయ వేళలు పాటించకపోతే చర్యలు తప్పవు
ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు వైద్య సిబ్బంది తప్పనిసరిగా సమయ వేళలు పాటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శనివారం ఉదయం సందర్భంగా సంతబొమ్మాలి మండలం బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో స్థానిక ఆరోగ్య కేంద్ర హాజరు పట్టికను పరిశీలించి వివరాలను సేకరించారు. సమయ వేళలు పాటించకపోతే చర్యలు తప్పమన్నారు.

సంబంధిత పోస్ట్