టెక్కలి ఎన్టీఆర్ కాలనీలో ఉన్న డిపో డీలర్ పై 6ఏ కేసు నమోదు చేసి సోమవారం సస్పెండ్ చేసినట్లు టెక్కలి పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు. సోమవారం డిపోలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో స్టాక్ పరంగా అధికస్థాయిలో లోటుపాట్లు కనిపించడంతో డీలరుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా గత ప్రభుత్వంలో ఇదే డీలరుపై స్థానికంగా పలు ఆరోపణలు ఉన్నాయి.