సంతబొమ్మాళి మండలం పాత మేఘవరం జడ్పీ హైస్కూల్ లో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా మత్స్య కార సహకార సంఘం డైరక్టర్ సూరాడ జోగారావు స్వంతంగా షీల్డ్, నగదు బహుమతులను విద్యార్థులకు అందజేశారు. హెచ్ఎం యు. డి. వి. ప్రసాద రావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు సుగ్గు సుశీల, చోడిపల్లి శివ , అర్జాల పూజ, తుంబల సాయి దీపిక లకు నగదు బహుమతులు అందజేశారు.