ప్రస్తుత కాలంలో మానవుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పని సరి అని బిజేపి మండల పార్టీ అద్యక్షుడు మెట్ట తిరుమలరావు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపురం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం యోగా కార్యక్రమం
నిర్వహించి విద్యార్ధులుతో సూర్య నమస్కారాలుతో పాటు పలు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నూక లక్ష్మణరావు, యోగ ఉపాధ్యాయులు నాగరాజు తదితరులు ఉన్నారు.