టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నిలిచిన సీటీ స్కాన్ సేవలు

77చూసినవారు
టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నిలిచిన సీటీ స్కాన్ సేవలు
టెక్కలి మండల కేంద్రం లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో గత రెండు రోజులుగా సీటీ స్కాన్ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. సీటీ స్కాన్ లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా టెక్కలి జిల్లా ఆసుపత్రికి వస్తున్న రోగులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. అధికారులు స్పందించి సీటీ స్కాన్ సేవలు పునరుద్ధరించాలని గురువారం పలువురు రోగులు కోరారు.

సంబంధిత పోస్ట్