సేవాభావంతో ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి, పేదల కడుపు నింపడంలో మీ వంతు సహకారాన్ని అందించాలని టెక్కలి ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శుక్రవారం అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి జిల్లాకు చెందిన పలువురు దాతలు నుంచి విరాళాలు సేకరించారు. త్వరలో మండల పరిధిలో కూడా అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.